అమెజాన్.. ఎన్నో నాగరికతలకు ఆలవాలమైన మహానది. సుమారు 6,400 కి.మీ పొడవుంటే ఈ నది దక్షిణ అమెరికా ఖండంలోని దాదాపు 30 శాతం భూభాగంలో ప్రవహిస్తోంది. ప్రపంచ నదీజలాల్లో అయిదోవంతు నీటని అమెజాన్ కలిగి ఉందంటే ఇది ఎంత పెద్దతో అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లు అమెజాన్ నే అధ్బుతమనుకుంటున్న ప్రపంచానికి మరో గొప్ప విషయాన్ని తెలియజేశారు ఆ దేశ శాస్త్రవేత్తలు. అదేంటంటే అమెజాన్ నది కింద మరో నది ప్రవహిస్తోందట. స్వయంగా రెండు దశాబ్ధాలపాటు పరిశోధనలు జరిపిన మీదట ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిశోదనకు నాయకుడిగా వి.ఎమ్. హమ్జా. బ్రిజిల్ ఒక పర్యాటకుడిగా వెళ్లి ఈ పరిశోధనలు చేసినట్లు తెలుస్తోంది. కేరళలోని కోజికోడ్ లో పుట్టారు వళియమన్నతల్ హమ్జా. డిగ్రీ నుంచే ఆయనకు భౌతిక శాస్త్రమంటే ఆసక్తి ఉండేది. పీజీ అయ్యాక భౌతిక శాస్త్ర అద్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. ఆయనకు ఉద్యోగం చేస్తున్నప్పుడే కేనడా నుండి పీహెచ్ డీ చేసేందుకు స్కాలర్ షిప్ వచ్చింది. అయితే ఆయనకు అమెరికా వెళ్లాలన్న ఆలోచనా వచ్చిందట. సరిగ్గా అదే సమయంలో బ్రెజిల్ లోని ఆయన స్నేహితుడు బ్రిజిల్ రామ్మని ఆహ్వానించాడట. హమ్జా ఆరునెలల పర్యటన కోసం వీసా తీసుకున్నారు. అక్కడికి వెళ్లాక ఆ స్నేహితుడు .. నీ పరిశోధనలు ఇక్కడ కూడా చేయొచ్చు కదా అన్నాడు.
ఆయన సత్తా ఏంటో నిరూపించుకోవటాని పరిశోధనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొన్ని సంవత్సారాల తరువాత బ్రెజిల్ లోని పేరు గాంచిన విశ్వవిధ్యాలయం వారు ఆయన ప్రతిభ ను గుర్తించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు చెప్పడానికి ఒప్పుకున్నారట. ఆయన 1992 లో చేపట్టిన పరిశోధనలు బ్రెజిల్ ప్రభుత్వం గుర్తించినట్లు చెబుతున్నారు. అప్పుడు రియో డి జనిరోలోని నేషనల్ అజ్జర్వేటరీ ఆయన్ను పిలిచి మరీ ఉద్యోగం ఇవ్వటం జరిగిందట.హమ్జా దగ్గర పనిచేసే చాలా మంది విద్యార్థులో ఎలిజబెత్ పిమెంటెల్ ఒకరు ఉన్నారని ఆయన చెబుతున్నారు. 1970లో బ్రెజిల్ ప్రభుత్వ సంస్థ అయిన పెట్రో బ్రాస్ అమెజాన్ నదిలో తవ్వకాలు జరిపింది. వాళ్లు చమురు అనేష్వణ వరకే పరిమితమయ్యారు తప్ప అక్కడే ఓ అధ్బుతం ఉందన్న దిశగా పరిశోధనలు చేయలేదు. ఎలిజబెత్ కు ఆ బావులపై అధ్యయనం చెయాలనిపించింది. అప్పుడు హామ్జా సైన్యం ఆ అటవీ ప్రాంతాల్లో మకాం వేసి , పరిశోధనలు మొదలు పెట్టింది. అమెజాన్ లోని 241 చమురు బావుల్లో పరిశోధనలు చేశారు. ఆ బావుల్లోని ఉష్ణోగ్రతలు వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. సాధారణంగా నదీగర్బంలో ఉండే ఉష్ణోగ్రతల కంటే అవి చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణం. నదీగర్బంలో అంత చల్లగా ఉందంటే అందుకు మరేదైనా నీటి ప్రవాహం కారణమై ఉంటుందని ఊహించారు హమ్జా. ఆ దిశగా పరిశోధనలను సాగించారు. అమెజాన్ నది ప్రవహించే కొన్ని ముఖ్యమైన చోట్ల సుమారు నాలుగు కిలోమీటర్లు లోతున్న ఉష్ణోగ్రతలు సేకరించారు. ఆయన ఊహ నిజమైంది. అమెజాన్ నదికింద మరో నీటీ ప్రవాహం ఉందని గుర్తించారు.
ఈ నది అమెజాన్ కంటే వెడల్పైనదిగా గుర్తించారు. ఈ నది పొడవు దాదాపుగా అమెజాన్ పొడవుతో సమానం. అమెజాన్ నది వెడల్పు గరిష్టంగా 100.కి.మీ ఉంటే దీని వెడల్పు 400 కి. మీ. ఈ నది ప్రవాహవేగం మాత్రం చాలా తక్కువ. ఈ పరిశోధన వివరాలను హామ్జా సభ్యులు రియో డీ జనిరోలో జరిగిన బ్రెజిల్ భూభౌతిక శాస్త్రవేత్తల జాతీయ సదస్సు లో ప్రకటించటం జరిగింది. ఆయన కమిటీ సభ్యులు ఈ నదిని కనుగొనడంలో కీలకపాత్ర వహించారు హమ్జా. అందుకే ఈ నదికీ ఆయన పేరే పెట్టాలని మా సూచన అని ప్రభుత్వాన్ని కోరటం జరిగిందట. ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది. దానికి రియో హమ్జా అని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి స్పందిస్తూ .. చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. బ్రెజిల్ కు పర్యాటకుడిగా వచ్చిన నాకు ఇంత గౌరవం దక్కడం నిజంగా నా అద్రుష్టం అంటారు హమ్జా?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more